ప్రజాశక్తి-మదనపల్లె విద్యార్థులు యోగాతో మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చని మైసూర్ దత్తక్రియ యోగా ఇంటర్నేషనల్ కేంద్రం డైరెక్టర్ వెంకటకామేశ్వరరావు అన్నారు. గురువారం స్థానిక మిట్స్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కామేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల మనసు శాంతిగా ఉంచుకోవాలన్నారు. మనస్సును ఏకాగ్రతపై తీసుకురావడానికి మెడిటేషన్ అనేది చాలా అవసరమని తెలిపారు. ధ్యానం మనస్సుకు విశ్రాంతతనిస్తుంన్నారు. మెడిటేషన్ వల్ల పెరిగిన రక్తపోటు నార్మల్‌గా మారుతుందని పరిశోధనలో వెల్లడైందని పేర్కొన్నారు. కార్యకమంలో డాక్టర్ శివ ప్రకాష్, స్టూడెంట్స్ ఆక్టివిటీ సెంటర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ రెడ్డి హేమంత, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరం, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్, దత్తక్రియ యోగ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారని డైరెక్టర్ డాక్టర్ రామలింగారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సతీష్ బాబు, హుమ్యూనిటీస్ అండ్ సైన్స్ విభాగ్యపతి డాక్టర్ అమర్నాథ్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి అరుణ్ కుమార్‌రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్, అధ్యాపకులు అశోక్ కుమార్, హేమలత, విద్యార్థులు పాల్గొన్నారు.
