ఆదిత్య నగర్ కాలనీలో కాలువలు నిర్మించాలి

Oct 7,2024 17:02 #Kurnool

ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు కార్పోరేషన్ పరిధిలోని 27 వ వార్డులో ఆదిత్యా నగర్ కాలనీ కాలువలు నిర్మించాలని ఆదిత్య నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యలు సోమవారం అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో అనేక సార్లు మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా ఇంతవరకు సమస్యకు పరిష్కారం చేయలేదని ఇప₹డైనా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. వర్షం కురిసిన ప్రతీ సారి రోడ్డు పైన ప్రవహించే నీళ్లలో తిరుగులేని పరిస్తితి ఏర్పడుతుందని, నేషనల్ హైవే సర్విసు రోడ్డు పైన ఉన్న కల్వర్టు ఎత్తు లేక పోవడం వలన, ఆదిత్యా నగర్ కాలనీ కాలువలు ఎపుడో పంచాయతీ కాలం లో వెసినవి కావడం వల్ల వర్షం కురిసిన ప్రతీ సారి రోడ్డు పైన ప్రవహించే నీళ్లతో కాలనీ ప్రజలు ఇళ్ల లొనుంచి బయటకు రాలేని పరిస్తితి ఏర్పడుతుందని, నేషనల్ హైవే సర్విసు రోడ్డు మీదుగా కల్లూరు కు వెళ్లే ప్రధాన రహదారి కావడం వలన రోజు ఆ రోడ్డు మీదుగా రొజు వేలాది మంది టూవీలర్ కార్లు ట్రాక్టర్లు భారీ వాహనాలు నిరంతరం ప్రయాణిస్తూ ఎప్పుడూ రద్దీ గా ఉంటుంది. కాలనీ ప్రజలు వర్షం కురిసిన ప్రతీ సారి రోడ్డు పైన నడవడానికి వీలు లేని విధంగా పాదాలు మునిగి పోయే విధంగా బురదతో నిండి పోయి ఉంటుంది.  దీనికి కారణం కాలువ నీళ్లు పైకి ఎక్కి పారడం ప్రధాన కారణం. కావున అదనపు కమిషనర్ సమస్యను పరిశీలించి పరిష్కరించాలని కోరుతూ ప్రజాదర్బార్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి ఇచ్చినవారిలొ ఆదిత్యా నగర్ కాలనీ అసొషియన్ కార్యదర్శి, బి యస్ యల్ ప్రసాద్ శర్మ,వి. భాస్కర్ రెడ్డి, సి. హెచ్. సాయిబాబా, యస్. అక్బర్ బాషా, కాలనీ వాసులు ఉన్నారు. వినతి పత్రం తీసుకున్న అనంతరం అదనపు కమిషనర్ ఆర్,జీ,వి,క్రిష్ణ స్పందించి అక్కడనే ఉన్న ఎఈ గారికి సమస్య ను వెళ్లి పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. ఎఈ రెండు రోజుల లో వచ్చి పరిశీలించి పరిష్కారం కొరకు కృషి చెస్తామని హామీ ఇచ్చారు.

➡️