ప్రజాశక్తి-కడప అర్బన్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చలో విజయవాడ కార్యక్రమానికి తరలివెళుతున్న అంగన్వాడీలను హౌస్ అరెస్టు చేయడం, నిర్బంధించడం సరైనది కాదని సిఐటియు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శిలు బి.మనోహర్, నాగసుబ్బారెడ్డి అన్నారు. సోమవారం ఆర్‌డిఒ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయడానికి విజయవాడలో నిరసనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్‌ను పోలీసులు ద్వారా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అధికారులతో ఇబ్బంది పెట్టడం సరైంకాదని చెప్పారు. అధికారులు, ప్రభుత్వం రూ.26 వేల జీతం పెంచితే ఇలాంటి ఆందోళన చేయాల్సిన అవసరం ఉండదు కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అరెస్టులు మానుకుని జీతం పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని తెలిపారు. నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా నాయకులు ఎ.రామ్మోహన్, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరిరెడ్డి, సిఐటియు నాయకులు నాగేంద్ర పాల్గొన్నారు. బద్వేలు : బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో ఆర్‌డిఒ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించి అనంతరం ఆర్‌డిఒకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె.నాగేంద్రబాబు, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు గౌరవ అధ్యక్షురాలు కె.సుభాషిని మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుని అరెస్టులు, నిర్బంధాల ద్వారా అణచివేయాలనుకోవడం దుర్మార్గకరమైన చర్యని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఇరుపోతు ఓబులేసు, పట్టణ నాయకులు షేక్ మస్తాన్ షరీఫ్, రూరల్ నాయకులు ముడమాల ఓబుల్‌రెడ్డి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బద్వేల్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి ఆర్.హుస్సేనమ్మ, ప్రాజెక్టు నాయకులు కళావతి, జయప్రద, రత్నమ్మ, కె.వి.సుభాషిని, విజయమ్మ, వాణి, సరోజ, వసంతమ్మ, లక్ష్మీ నరసమ్మ, శారదా, సుబ్బమ్మ, అనురాధ, సులోచన, లక్షుమ్మ, భారతి, సుధ, ప్రభావతి, సీయోను కుమారి, కృష్ణవేణి పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్ : ప్రభుత్వం నుంచి రావలసిన వాటి కోసం శాంతియుత పోరాటాలకు పిలుపునిస్తే అక్రమ అరెస్టులు చేయడం సరికాదని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీదేవి భాగ్యమ్మ తెలిపారు. స్థానిక ఐసిడిసి కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్‌లుగా మార్చాలని కోరుతూ విజయవాడలో మహా ధర్నాను జయప్రదం కోసం వెళ్తా ఉన్న వారిని అరెస్టు చేయడం ఎంతవరకు సమం జసమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశంలోని శ్రామిక మహిళలకు మరోసారి మోసం చేసిందన్నారు.కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు యేసుదాసు, సిఐటియు ఉపాధ్యక్షులు వినరు కుమార్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
