నేరాల నియంత్రణకే కార్డెన్‌సెర్చ్‌: సిఐ

ప్రజాశక్తి-గిద్దలూరు: నేరాలను నియంత్రించేందుకే కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని గిద్దలూరు అర్బన్‌ సీఐ సోమయ్య అన్నారు. శనివారం పట్టణంలోని అర్బన్‌ కాలనీలో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన వాహన పత్రాలు లేని 5 ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశారు. ప్రజల రక్షణార్థమే కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని, ప్రజలు నేరాల నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండి ప్రశాంత జీవితం గడపాలన్నారు. అలాగే పరిసరాలలో ఎవరైనా అనుమానిత, కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌ఐ రంగయ్య, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. దర్శి: దర్శి నగర పంచాయతీలో అక్రమంగా తిప్పుతున్న 10 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు దర్శి సిఐ షేక్‌ షమీముల్లా తెలిపారు. శనివారం దర్శి నగర పంచాయతీ లోని సాయి నగర్‌లో అక్రమంగా తిప్పుతున్న వాహనాలను తనిఖీ చేసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. హిందీలో లైసెన్స్‌ లేనివి, టాక్స్‌ కట్టనవి మొదలైనవి ఉన్నాయని అన్నారు. అదేవిధంగా నాలుగు ఆటోలు కూడా స్వాధీన పరుచుకున్నట్లు ఆయన తెలిపారు. వీరి వెంట ఎస్‌ఐ సుమన్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు. కనిగిరి: ప్రకాశం జిల్లా ఎస్పీ సుమిత్‌ సునీల్‌ గరుడ్‌ ఆదేశాల మేరకు కనిగిరి డిఎస్‌పి రామరాజు ఆధ్వర్యంలో కనిగిరి సిఐ వెంకటేశ్వరరావు, సిబ్బంది కనిగిరి మండలం చాకిరాలలో శనివారం కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి పత్రాలు లేని వాహనాలను సీజ్‌ చేశారు. గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరైనా ప్రజాశాంతికి భంగం కలిగించేటట్లు వ్యవహరిస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కనిగిరి ఎస్‌ఐ త్యాగరాజు, హనుమంతునిపాడు ఎస్‌ఐ శివ నాగరాజు, పిసి పల్లి ఎస్‌ఐ రమేష్‌ బాబు, సర్కిల్లోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

➡️