ప్రజాశక్తి -మద్దిపాడు: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను ఎస్సై బి.శివరామయ్య పట్టుకున్నారు. మంగళవారం మండల కేంద్రమైన మద్దిపాడులో ఒంగోలు వైపు వెళ్తున్న టిప్పర్లను తనిఖీ చేయగా ఇసుక తరలిస్తున్న పోలీసులు గుర్తించారు. దీనిపై మైనింగ్ అధికారులకు సమాచారం అందజేసి అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక టిప్పర్లను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
