విశాఖ : విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో మృతి చెందిన బాలుడి బంధువులను ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కే.జి.ఎచ్ మార్చురీ వద్ద పరామర్శించారు. అనంతరం పి.విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ …. పోర్ట్ స్టేట్డియం విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో బాలుడు మృతి చెందిన దుర్ఘటన పై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా వాటర్ వరల్డ్ యాజమాన్యం భద్రత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. పై ప్రమాద విషయాన్ని పోర్ట్ చైర్మన్ దృష్టికి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. గతంలో పోర్ట్ స్టేడియంలో గొ కార్టింగ్ కి వెళ్లిన తన మనమరాలు రోడ్డు పై పడిపోయి 45 రోజులు మంచంపై ఉందని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ సమయంలో తమవారిదే పొరపాటు అయి ఉండొచ్చని తాను ఆ ఘటనపై స్పందించలేదని చెప్పారు. వాటర్ వరల్డ్ యాజమాన్యం సేఫ్టీ ప్రికాషన్స్ అద్భుతముగా చేస్తున్నామని తనతో చెప్పారనీ, చిన్న పిల్లలు ఆనందంగా ఆడుకోవడానికి వస్తున్నారనీ, సరియైన జాగ్రత్తలు తీసుకోవాలని తాను వారితో చెప్పానని వివరించారు. నిన్న జరిగిన ఈ ఘటనలో చిన్నారి చావుకు కారణం విశ్వనాద్ స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యం మాత్రమేనన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మోటార్ సైకిల్ పై ట్రీట్మెంట్ నిమిత్తం తీసుకువెళ్లగా, అప్పటికే బాలుడు మృతి చెందాడని తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, డబ్బు ఆపేక్ష లక్ష్యంగా యాజమాన్యం పసిపిల్లల ప్రాణాలతో ఆడుకుంటుందని ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వేసవి సెలవుల్లో పిల్లలు మఅత్యుకూపంలోకి వెళ్లే అవకాశం ఉందని కలెక్టర్‌కి వెంటనే విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ మూసివేయాలని కోరారు. ఇలాంటి భద్రతా ప్రమాణాలు లేని స్పోర్ట్స్ క్లబ్ లపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. పర్యాటకుల ఆనందానికి ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించని స్పోర్ట్స్ క్లబ్ లకు వెళితే మృత్యు కుహరంలోకి వెళ్లినట్లేనని, పర్యాటకులు ప్రమాదాలకు గురి కావద్దని ఎమ్మెల్యే సూచించారు.
బాలుడి మృతిపై సిబిఐ విచారణ చేయాలి : ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు
