సీసీ రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌ (కోనసీమ) : గ్రామాలలోని అభివఅద్ధి పనులకు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. మంగళవారం అమలాపురం మండలం నల్లమిల్లి గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించే సీసీ రోడ్లు నిర్మాణ పనులకు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, సర్పంచ్‌ గోకరకొండ వాసు లతో కలిసి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లింగోలు పండు, టిడిపి నాయకులు, పాలమూరు ధర్మపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️