కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసుకోవాలి : సిడిపిఓ వాణిశ్రీదేవి

ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసుకోవాలని సిడిపిఓ వాణి శ్రీదేవి అన్నారు శుక్రవారం ఐసిడిఎస్‌ కార్యాలయంలో ప్రాజెక్ట్‌ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం జరిగినది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారంతో పాటు న్యూట్రిషన్‌ ఆహారాన్ని తీసుకోవాలని అదేవిధంగా గ్రామంలోని ప్రజలకి ప్రతి ఒక్కరు కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసుకోవాలని అందువలన తాజా కూరగాయలు ఆకుకూరలు లభిస్తాయని వాటి ద్వారా మనిషి కావలసిన విటమిన్‌ తీసుకోవచ్చు అన్నారు అనంతరం పౌష్టికాహార లభించే ఆకుకూరలు కాయగూరలు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్‌ జయశ్రీ కళ్యాణి పలువురు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️