ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి.

ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి.

ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి: ఈ నెల 9న ఆదివాసీగిరిజన సంఘం, ఆదివాసి జెఎసి ఆధ్వర్యంలో రాజవొమ్మంగిలో నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, ఆదివాసీ జెఎసి జిల్లా కన్వీనర్‌ వంతు బాలకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎంఆర్‌సి కార్యాలయం వద్ద ఆదివాసీ సంఘాల నేతలు, గిరిజన ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజవొమ్మంగిలో పార్టీలు, కులమతాలకు అతీతంగా నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో జెఎసి నేతలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.కార్యక్రమంలో ఆదివాసి జెఎసి నేతలు, ఉద్యోగ ఉపాధ్యాయులు వజ్రపు అప్పారావు, తొంట ఆదినారాయణ, కొండ్ల సూరిబాబు చీడి శివ, దాసరి పైడిమల్లు, పి రమణ, వెంకటేష్‌ పాల్గొన్నారు.

ఆదివాసీ మహానేతల నివాళికి తరలి రండి

రంపచోడవరం : ఈనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రంపచోడవరం ఆదివాసీ భవన్‌ వద్ద ఆదివాసీ మహానేతలకు నివాళులర్పించే ప్రత్యేక కార్యక్రమాన్నిఆదివాసీ (గిరిజన)ఉద్యోగుల సంక్షేమ, సాంస్కతిక సంఘం, జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిఆపరు. ఆదివాసీ హక్కులు చట్టాలు సాధన, పరిరక్షణకు పోరాడి అమరులైన ఆదివాసీ ఉద్యమ మహానేతలు బాతురెడ్డి .బాలురెడ్డి, పూసం.వెంకటేశ్వర్లు దొర,.కారం గంగరాజు దొర, అలాగే ఆదివాసీ పోరాట యోధులు కారం.తమ్మన్న దొర,.కొమురం భీమ్‌,బిర్సా.ముండా, పల్లాల అంబులురెడ్డిలకు నివాళులర్పించడంతోపాటు ప్రస్తుత పోరాట యోధులు, ఉద్యమ నాయకులను సత్కరిస్తామన్నారు. రంపచోడవరం,చింతూరు డివిజన్‌ 11 మండలాల్లోని ఆరు ఆదివాసీ తెగల ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజల సమక్షంలో ఉదయం.10 గంటలకు ఆదివాసీ జెండాను ఉద్యమ నాయకులు ఆవిష్కరిస్తారన్నారు. ఆదివాసీ ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు కత్తుల.ఆదిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కురసం ఫకీరు దొర, కోశాధికారి తాడే.రాజబాబు,వ మట్ల.కృష్ణారెడ్డి, కుంజం.అగ్గి దొర, సహాయ కార్యదర్శి ,విండెల.కృష్ణారావు ఉపాధ్యక్షుడు గంటిమల్ల. సత్యనారాయణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బొరగా పొట్టి దొర తెలిపారు.

➡️