10న ‘డిమాండ్స్‌ డే’ని జయప్రదం చేయండి

చిలకలూరిపేట: కార్మికుల హక్కుల సాధన కోసం, కేంద్ర ప్రభుత్వం లేబర్‌కోడ్స్‌ను అమలు చేయొద్దని కోరుతూ ఈ నెల 10న దేశ వ్యా ప్తంగా జరిగే ‘డిమాండ్స్‌ డే’ ని జయప్రదం చేయాలని సిఐటియు మండల కన్వీనర్‌ పేరుబోయిన వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక పండరీ పురంలని సిఐటియు కార్యాలయంలో ఆదివారం మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సం దర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం దేశ సంపదను కార్పొరేటర్లకు కట్టబెట్టే ప్రైవేటీకరణ విధానాలు కొనసాగిస్తామంటోందని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయనికుండా ఆపాలని, ప్రావి డెంట్‌ ఫండ్‌ పీఎఫ్‌ సకాలంలో చెల్లించని యజ మానులకు వేసే జరిమానాపై రాయితీలు ఇస్తూ ఉత్త ర్వులు జారీ చేయడం అన్యాయమన్నారు. ఇటువంటి చట్టాల వల్ల రాబోయే కాలాల్లో యజమాను లెవరు పిఎఫ్‌ బకాయిలు, సకాలంలో చెల్లించకుండా జాప్యం చేస్తారన్నారన్నారు. లేబర్‌ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటీకరణను, జాతీయ నగదు బదిలీ పథకం (నేషనల్‌ మోని టైజేషన్‌ ఆఫ్‌ పైప్‌ లైన్‌) లను ఆపాలన్నారు. అంగన్వాడీి, ఆశ, మధ్యాహ్నం భోజన పథకం, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, సమగ్ర శిక్ష, వెలుగు, మెప్మా, ఉపాధి హామీ, నేకో, ఆయుష్‌, సేంద్రీయ వ్యవసాయం, 108, 104 తదితర అన్ని పథకాల కార్మికులను కార్మి కులుగా గుర్తించాలని, వారికి కనీస వేతనం చెల్లిం చాలని, వారికి పింఛన్‌ లాంటి సామాజిక భద్రత సౌక ర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం నెలకు రూ.26,000 చొప్పున నిర్ణయించి అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌, పార్ట్‌ టైం, గెస్ట్‌ తదితర కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిం చాలన్నారు. కాంట్రాక్టర్లను తొలగించినా కార్మికులను తొలగించకూడదని, అందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకువచ్చిన 101,102 ఎంవిఆర్‌టి బిల్లును ,రాష్ట్రంలో అమలవుతున్న 21వ జీవోని వెంటనే రద్దు చేయాలని, రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు వెం టనే అమలు చేయాలన్నారు. అంతేకాకుండా రెగ్యు లర్‌ చేయాలన్నారు. ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమును అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను పూర్తి సామర్థ్యంతో నడపాలని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవా లన్నారు. పలు డిమాండ్ల సాధన కోసం మండల, నియోజకవర్గంలోని అన్ని కార్మిక సంఘాల వారు ‘డిమాండ్స్‌ డే’ను జయప్రదం చేయాలని కోరారు. సమావేశానికి అధ్య క్షులుగా సాతులూరి బాబు వ్యవహరించారు. సిఐటియు సహాయ కార్యదర్శి ఎం. విల్సన్‌, సిఐటియు, సంఘాల నాయకులు అంగ న్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజన కార్మికులు, భవన నిర్మాణ, విద్యుత్‌ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

➡️