వైభవంగా సంక్రాంతి సంబరాలు

ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం సమీపంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ముందస్తు సంక్రాంతి సబంరాలు అంబరాన్నంటాయి. శనివారం ‘కిట్స్‌ ఇంజనీరింగ్‌’ కళాశాలలో, డాక్టర్‌ శామ్యూల్‌ జార్జి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఈ వేడుకలు జరిగాయి. కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఆ కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ అన్నా కృష్ణ చైతన్య-అనూష ఆధ్వర్యంలో నిర్వహంచారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆ కళాశాల చైర్మన్‌, మాజీ మ్మెల్యే అన్నా వెంకటరాంబాబు, ఆయన సతీమణి దుర్గాకుమారి పాల్గొ న్నారు. అనంతరం అన్నా రాంబాబు మాట్లాడారు. తెలుగు వారికి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటన్నారు. ఇలాంటి వేడుకల ద్వారా సంప్రదాయ పద్ధతులు రాబోయే తరానికీ తెలిపే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గాలి పటాలను ఎగరవేస్తూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. శుభారం భం-ఐశ్వర్యానికి సూచికగా సంప్రదాయ కార్యక్రమాలు అలరించేలా నిర్వహించారు. రంగోలి పోటీలు, హరిదాసు వేషధారణ, జానపద నృత్యాలు, సంగీతం, సాంఘిక నాట కాలతో విద్యార్థినీ విద్యార్థులు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వెన్నా కృష్ణారెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఏ రంగనాయకులు, కళాశాల ఏఓ బి ప్రభాకర్‌, వివిధ విభాగపు అధిపతులు పి రామ్మోహన్‌, డాక్టర్‌ జెవి అనిల్‌కుమార్‌, కె రాముడు, కె కిషోర్‌బాబు, ప్రసన్నమురళి, జె రమణారెడ్డి, ఎ అమృతవల్లి, పి మనో హర్‌, ఫిజికల్‌ డైరెక్టర్లు ఎన్‌ రంగస్వామి, ఎన్‌విఎస్‌ఎన్‌ అంజనీకుమార్‌, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జార్జి ఇంజనీరింగ్‌ కళాశాలలో… స్థానిక డాక్టర్‌ శామ్యూల్‌ జార్జి ఇంజనీరింగ్‌ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా శనివారం జరిగాయి. కార్యక్రమంలో భాగంగా మన సంస్కృతిలో పండుగల యొక్క విశిష్టత, ప్రాముఖ్యతను ఆ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సిహెచ్‌ రాజబాబు విద్యార్థులకు తెలియ జేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కళాశాల లో భోగి మంటలు వేశారు. ప్రతి ఒక్కరూ కుటుంబాలతో ఆనందంగా సంక్రాంతిని జరుపుకోవాలని ఆ కళాశాల సాంతిక సలహాదారు, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజబాబు, డీన్‌ డాక్టర్‌ ఎం మస్తానయ్య, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️