వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

Apr 17,2024 21:59

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : శ్రీరాముడు చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ అనుచరణీయమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. నగరంలో నిర్వహించిన పలు వేడుకలలో ఆయన పాల్గొన్నారు. చిక్కాల వీధి రామ మందిరం వద్ద నిర్వహించిన శ్రీరాముని కళ్యాణాన్ని తిలకించారు. బూడి వీధిలో కోదండరామ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కోలగట్ల ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమాలలో స్థానిక కార్పొరేటర్లు గుజ్జల నారాయణరావు, రేగాన రూపా దేవి, వరహాచారి,డొంకాడ పద్మావతి, శ్రీను పాల్గొన్నారు.

తోటపాలెంలోని కోదండ రామస్వామి ఆలయ ంలో ఆలయ కమిటీ సభ్యులు పతివాడ సత్యనారాయణ, ఆర్లె కృష్ణారావు తదితరుల ఆధ్వర్యాన సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, మంగళ శాసనం, అనంతరం సీతారాముని కల్యాణం, సాయంత్రం పట్టాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, బొత్స లక్ష్మణరావు కుటుంబీకులు సీతారాములను దర్శించుకున్నారు.

వేపాడ : మండలంలోని శ్రీరామనవమి వేడుకలు పలు గ్రామాలలో వైభవంగా నిర్వహించారు. బానాది, వావిల పాడు, వేపాడ, వల్లంపూడి, సింగరాయి, జగ్గయ్యపేట, సోంపురం, అరిగి పాలెంలో వేద పండితులు మంత్రాఛరణల నడుమ నిర్వహించారు. బానాదిలో గొంప వెంకటరావు దంపతులు, వావిలిపాడులో బీల సతీష్‌ దంపతులు, వేపాడలో గుమ్మడి భారతీ దంపతులు, జగ్గయ్యపేట, సోంపురం అరిగి పాలెం, జాకెరు, పాటూరు గ్రామాలలో సర్పంచులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బొబ్బిలి: పట్టణంలో బజారులో ఉన్న రామాలయం, దావాలవీధి రామాలయంలో సీతారాముల కళ్యాణం చేసి భక్తులకు అన్నదానం చేశారు. పూజలకు భక్తులు క్యూ కట్టారు. చిన బజారు రామాలయంలో పూజలు చేశారు.బాడంగి: మండలంలోని ఆకులకట్ట, గజరాయనివలస, పిన్నవలస, వాడాడ గ్రామాల్లో బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఎస్‌విఎల్‌ఎన్‌ శర్మ యోజీ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.డెంకాడ: చింతలవలస గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడిలో నవమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.

రామభద్రపురం: మండల కేంద్రంలోని వసంతుల విధి రామాలయంలో బ్రహ్మశ్రీ బాధంపూడి నాగరామలింగేశ్వర శర్మ, ఆరికతోట రామాలయం ప్రధాన అర్చకులు చిలుకూరి రవి శర్మల ఆధ్వర్యంలో వైభవంగా కల్యాణాలు నిర్వహిం చారు. ఎస్‌.చింతలవలస రామమందిరంలో నిర్వహించిన వేడుకలలో బొబ్బిలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబీనాయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమ ంలో టిడిపి జిల్లా నాయకులు మడక తిరుపతినాయుడు, కర్రోతు తిరుపతిరావు, పాల్గొన్నారు.

గజపతినగరం: మండల కేంద్రంలో రామాలయంలో ప్రముఖ న్యాయవాది ఉప్పలపాటి రమేష్‌ రాజు దంపతులు కళ్యాణంలో కూర్చోగా, పలుచోట్ల వస్త్రాలు సమర్పించి నూతన దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీరామదూత యువజన సంఘం అధ్యక్షులు కందుల చిన్నయ్య స్వామి పాల్గొన్నారు.మెరక ముడిదాం: మండలంలోని పెద్దమంత్రిపేట కొందండరామ ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు గ్రామ పెద్దలు, యూత్‌ సభ్యులు, ఆలయ ధర్మకర్త డాక్టర్‌ సాసుబిల్లి హరశ్రీ రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదటి రోజున పెండ్లి రాట, రెండవ రోజున రాత్రి ఆలయ ప్రాంగణములో భజన కార్యక్రమములు, మూడవ రోజు బుధవారం కల్యాణ మహౌత్సవం, అన్నదానం చేశారు.

➡️