ఘనంగా కోలగట్ల జన్మదిన వేడుకలు

May 27,2024 21:57

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  డిప్యూటీస్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. వైసిపి యువజన, విద్యార్థి విభాగం సంయుక్తంగా స్థానిక సుజాత ఫంక్షన్‌ హాలులో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 273 మంది స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వివిధ బ్లడ్‌ బ్యాంకుల ప్రతినిధులు రక్త సేకరణకు సహకరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ వేసవికాలంలో రక్తనిధి కేంద్రాలలో రక్త నిల్వలు తక్కువగా ఉంటాయని ఈ పరిస్థితుల్లో కోలగట్లపై ఉన్న అభిమానంతో పలువురు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ప్రజాహితాన్ని కోరుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా అవసరమైన వారికి సేవలందిస్తున్న కోలగట్ల వీరభద్రస్వామి తన ప్రజాసేవను మరింత విస్తత పరచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసిపి నగర అధ్యక్షుడు ఆశపు వేణు, ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌వివి రాజేష్‌, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్‌ బంగారు నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, జోనల్‌ ఇన్చార్జిలు, కార్యకర్తలు, కోలగట్ల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️