సుబ్రహ్మణశ్వర స్వామి సేవలో కేంద్ర బలగాలు

ప్రజాశక్తి-మోపిదేవి (కృష్ణా) : దేశ సమగ్రతలో భాగంగా భౌగోళిక పరిస్థితులపై అవగాహన కోసం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు కేంద్ర బలగాలు చేపట్టిన సైకిల్‌ యాత్ర శుక్రవారం మోపిదేవి మండలానికి చేరుకుంది. సెంట్రల్‌ ఇండిస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ కి చెందిన బృందం 216 జాతీయ రహదారిపై వెళ్తూ వెళుతూ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు అర్చకులు కేంద్ర బృందానికి స్వాగతం పలికి దేవాలయ గొప్పతనాన్ని వివరించారు. చల్లపల్లి సిఐ ఈశ్వరరావు మోపిదేవి ఎస్‌ఐ కెవి సత్యనారాయణ పర్యవేక్షణలో కేంద్ర బలగాలకు మోపిదేవి నుంచి వీడ్కోలు పలికారు.

➡️