ప్రిజిం-10 అమలుపై కేంద్ర బృందం ఆరా

Jun 8,2024 20:55

ప్రజాశక్తి – పాచిపెంట : జిల్లాలో అమలవుతున్న ప్రిజం-10 కార్యక్రమం పనితీరుపై కేంద్ర బృందం ఆరా తీయిస్తుంది. ఇందులో భాగంగా మండలంలోని పనుకువలస, పంచాడవలస తదితర గిరిజన గ్రామాల్లో అమలవుతున్న ప్రిజం-10 కార్యక్రమాన్ని కేంద్ర బృందం సభ్యులు సుదర్శన్‌ భగత్‌, సొలోన్‌ శాన్యాల్‌ శనివారం పరిశీలించారు. ప్రిజం -10 కార్యక్రమంపై జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం గర్భిణులతో నేరుగా మాట్లాడారు. రక్తహీనత నివారణకు చేపడుతున్న చర్యలు గురించి ఎంపిడిఒ పి.లక్ష్మీకాంత్‌ బృందం సభ్యులకు వివరించారు. మండలంలో ప్రతి సచివాలయ పరిధిలో ఉద్యోగులతో క్షేత్రస్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి గర్భిణుల్లో రక్తహీనతకు గల కారణాలు అన్వేషిస్తూ నివారణ చర్యలు వైద్యశాఖ ద్వారా ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు చేసి అవసరమైన మందులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా మెరుగైన పౌష్టికాహారం అందజేస్తుందన్నారు. గర్భిణీల్లో రక్తహీనత నివారణతో శిశు మరణాలు తగ్గుతాయని బృందం సభ్యులకు నివేదించారు. కార్యక్రమంలో వైద్యాధికారి వెంకటరమణ, ఐసిడిఎస్‌ సిడిపిఒ బి.అనంతలక్ష్మి, ఎపిఎం జయకుమార్‌, ాపనుకువలస సర్పంచ్‌ సిహెచ్‌ సీతారాం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.గిరిజన గర్భిణుల స్త్రీల హాస్టల్‌ పరిశీలనసాలూరు: పట్టణంలోని గుమడాం వైటిసిలో గల గిరిజన గర్భిణుల హాస్టల్‌ను శనివారం సాయంత్రం కేంద్ర అధికారుల బృందం పరిశీలించింది. కేంద్ర అధికారులు సుదర్శన్‌ భగత్‌, సొలోన్‌ శాన్యాల్‌ ప్రిజమ్‌ 10లో భాగంగా పట్టణంలోని గర్భిణుల హాస్టల్‌ను పరిశీలించారు. గిరిజన గర్భిణులకు అందుతున్న వైద్యం, ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. వీరి వెంట డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ శివకుమార్‌, డాక్టర్‌ వెంకటరమణ, నీడ్‌ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ పి.వేణుగోపాల్‌ వున్నారు.

➡️