నీటి సమస్య పరిష్కారానికి చర్యలు: ఛైర్మన్‌

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ తెలిపారు. బుధవారం సమస్య పరిష్కారం కార్యక్రమంలో భాగంగా కనిగిరి పట్టణంలోని 9వ వార్డు కొలిమి బజారులోని ప్రజల ఫిర్యాదు మేరకు ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో నీటి సమస్య, పారిశుధ్య సమస్యలను చైర్మన్‌ దృష్టికి తీసుకురాగా వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు రెహమాన్‌, పండు, మన్సూర్‌, నాగూర్‌, భారతి తదితరులు పాల్గొన్నారు.

➡️