చైత్ర దీపిక ప్రతిభ

Dec 11,2024 17:24 #Chaitra Deepika, #talent

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌ (అనకాపల్లి) : నేషనల్‌ రోలర్‌ స్కేటింగ్‌ పోటీలలో ఆంధ్రప్రదేశ్‌ కు ప్రాతినిధ్యం వహిస్తున్న చైత్ర దీపిక వరుస విజయాలతో దూసుకుపోతుంది. 59%, 60, 61% నేషనల్‌ రోలరు స్కేటింగ్‌ ఛాంపియన్షిప్స్‌ జాతీయ స్థాయి పోటీల్లో ఇప్పటి వరకు 11 పతకాలను కైవసం చేసుకున్న చైత్ర దీపిక, తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పొల్లాచి (కోయంబత్తూరు) లో ఈ నెల 5 నుంచి 15 వరకు జరుగుతున్న 62% నేషనల్‌ రోలరు స్కేటింగ్‌ ఛాంపియన్షిప్స్‌ (రోలరు. స్కేటింగ్‌ ఫెడరేషన్‌ అఫ్‌ ఇండియా) లో 14-17 వయసు విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరుపున కపుల్‌ డాన్స్‌ స్కేటింగ్‌ లో దీటైన ప్రదర్శిన యిచ్చి కాంస్య పతకం సాధించింది. నర్సీపట్నంకు చెందిన చైత్రదీపిక, తన తండ్రి పెదిరెడ్ల రామసతీష్‌ ఉద్యోగరీత్యా విజయవాడలో ఉండటంతో, అక్కడే సాధన చేస్తుంది. నర్సీపట్నంకు చెందిన చైత్రదీపిక జాతీయస్థాయిలో పతకాలు సాధించినందుకు స్థానిక క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు. కృష్ణా యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ఎస్‌. రామకృష్ణారావు, కె. కమలాకర్‌ డీసీఎం. రైల్వేస్‌ అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

➡️