ఎంఎల్‌ఎ ఇంటూరి సమక్షంలో టిడిపిలో చేరుతున్న చాకిచర్ల సర్పంచ్
టిడిపి గూటికి చాకిచర్ల సర్పంచ్
ప్రజాశక్తి-కందుకూరు :వైసిపి మద్దతుతో గెలిచిన ఉలవపాడు మండలం, చాకిచెర్ల పంచాయతీ సర్పంచ్ వీరమల్లు విజయమ్మ సోమవారం టిడిపిలో చేరారు. ఎంఎల్‌ఎ ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు. సర్పంచ్‌తో పాటు 10 వ వార్డు సభ్యుడు ప్రళయకావేరి అంకయ్య, వైసిపి నాయకులు తోట వెంకటనారాయణ తదితరులు పార్టీలో చేరారు. ఎంఎల్‌ఎ నాగేశ్వరరావుపై నమ్మకం, ఆయన కల్పిస్తున్న భరోసాతో టిడిపిలో చేరుతున్నామని సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరినవారు ఎంఎల్‌ఎను సత్కరించారు. పంచాయతీ అభివృద్ధికి సహకారం ఇస్తానని హామీ ఇచ్చారు. చాకిచెర్ల గ్రామ టిడిపి అధ్యక్షుడు మిరియం మల్లికార్జున ఉన్నారు.
