ప్రజాశక్తి -సాలూరు : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పట్టణంలోని రెల్లివీధిలో వున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండలం అధ్యక్షులు ఆముదాల పరమేష్ పాల్గొన్నారు.సీతానగరం : అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత రాజ్యాంగం నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర ఎనలేనిదని అన్నారు. కార్యక్రమంలో జెసి శోభిక, ఐటిడిఎ పిఒ శ్రీవాత్సవ్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.పార్వతీపురం : అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పట్టణ ప్రధాన రహదారిలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి, పట్టణ వైసిపి అధ్యక్షులు కొండపల్లి బాలకష్ణ, మండల అధ్యక్షులు బొమ్మి రమేష్, పలువురు ఎంపిపి, వైసిపి నాయకులు,కార్యకర్తలు, సర్పంచలు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.సాలూరు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బంగారమ్మపేటలో ఆయన విగ్రహానికి మాజీ డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్ కన్వీనర్ గిరిరఘు, వైసిపి ఫ్లోర్ లీడర్ గొర్లి జగన్ మోహన్ రావు, కౌన్సిలర్ లు గొర్లి వెంకటరమణ, సింగారపు ఈశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సీతానగరం : నవభారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పెదబోగిలి సర్పంచి జొన్నాడ తెరేజమ్మ పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో సీతానగరం వెటర్నరీ హాస్పిటల్ ఏడి దినకుమార్ పాల్గొన్నారు.