‘చలో హైదరాబాద్‌’కు తరలిరావాలి

ప్రజాశక్తి-శింగరాయకొండ: హైదరాబాదులో ఈనెల 7వ తేదీన జరుగు తున్న ‘లక్ష డప్పులు, వేల గొంతులు’ కార్యక్రమా నికి తరలిరావాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ మున్నంగి నాగరాజు మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం శింగరాయకొండ సుందర్‌ నగర్‌ మాదిగ పల్లెలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలుకై ఈనెల 7వ తేదీన హైదరాబాదులో మాదిగల భారీ సాంస్కతిక ప్రదర్శన ఎల్బీ స్టేడి యం నుంచి అసెంబ్లీ వరకు జరుగుతుంద న్నారు. ఈ సందర్భంగా శింగరాయకొండ మం డల ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షులు మెత్తళ్ళ రాజారాం మాదిగ మాట్లాడుతూ ప్రతి ఒక్క మాదిగ ఒక డప్పుతో రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసింగరావు మాదిగ, వర్ల దేవదాసు మాదిగ, రణమాల శేఖర్‌ మాదిగ, సుందర్‌ నగర్‌ యువకులు, గౌడ్‌ పేరు అనిల్‌ మాదిగ, చేవూరు శ్రీహరి మాదిగ, పొనుగోటి లాజర్‌ మాదిగ, మాదిగ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలో హైదరాబాద్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.టంగుటూరులో..టంగుటూరు: హైదరాబాద్‌లో ఫిబ్రవరి 7వ తేదీన జరిగే ‘లక్ష డప్పులు’ కార్యక్రమానికి మాదిగలు అంతా తరలి రావాలని ఉసిరిపాటి బ్రహ్మయ్య కోరారు. ఎస్సీ వర్గీకరణ అమలుకై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా టంగుటూరు బస్టాండ్‌ సెంటర్లో అంబేద్కర్‌ బొమ్మ వద్ద వాల్‌ పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బి.సుదర్శనబాబు, బి.సాగర్‌, శికా చిట్టిబాబు, చుండి నరశింహం, రావి నూతల అజరు మాదిగ సోదరులు పాల్గొన్నారు.

➡️