ప్రజాశక్తి – కడప అర్బన్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సందర్బంగా ఇచ్చిన మాట మేరకు నిలబెట్టుకుంటూ పెరిగిన పింఛన్ మొత్తంతో పాటు మూడు నెలల బకాయిలు పండుగ వాతావరణంలో పంపిణీ చేశారని కడప ఎమ్మెల్యే మాధవి తెలిపారు. సోమవారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి 49. డివిజన్ అలంకాన్ పల్లె, గోకుల్ లాడ్జ్, బికెఎం స్ట్రీట్, ప్రాంతాలలో పాల్గొని స్వయంగా లబ్దిదారులకు పింఛన్ల మొత్తాన్ని పంపిణీ చేశారు. వద్దులైన పలువురు పింఛన్‌దారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గతంలో చెప్పినట్లు పింఛన్ మొత్తం రూ.4 వేలకు పెంచడమే కాకుండా ఏప్రిల్, మే, జూన్ కు సంబంధించి మొత్తం రూ.7 వేలు సిఎం చంద్రబాబు ఆదేశంతో సచివాలయ సిబ్బంది సహకారంతో లబ్దిదారులకు అందించామన్నారు. పింఛన్ల అనేది టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మానస పుత్రిక అన్నారు. కడప ప్రజల సంక్షేమం, నగర అభివ ద్ధికి తనవంతుగా కషిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి తోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కలసపాడు :మండలంలోని గంగాయపల్లి, చెన్నుపల్లి, హృదయపేట, లింగారెడ్డిపల్లి గ్రామాల్లో వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు, వింతతువులకు టిడిపి బద్వేల్ ఇన్‌ఛార్జి రితిష్‌రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సాధన కారి రంతు, టిడిపి నాయకులు వెంకట్రామిరెడ్డి, ముట్టి చెన్నయ్య, చంద్రశేఖర్, ఓబులేష్, వీరారెడ్డి, రసూల్, పంచాయతీ సెక్రటరీ శ్రీధర్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కాశినాయన : మండల పరిధిలోని గంగనపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మండల యువ నాయకుడు హోండా రవీంద్రా రెడ్డి చేతుల మీదుగా అర్హులకు పింఛన్లు పంపిణీ చేశారు. చెన్నూరు : సోమవారం ఉదయం ఆరు గంటలకే మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సచివాలయ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు పంపిణీ చేశారు. చెన్నూరులోని భవాని నగర్, శ్రీరామ్నగర్,లక్ష్మీ నగర్, కొత్త గాంధీనగర్, ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కల్లూరి విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మల మల్లికార్జునరెడ్డి, శివరెడ్డి, కుందేటి లడ్డు బాబు. చెన్నూరు తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ ఇన్‌ఛార్జి జడ లక్ష్మీనారాయణ. అత్తికారి విశ్వం, చెన్నూరు మండలం చెన్నూరు మండల ఐటిడిపి ఛాంపియన్ యామాల మణికంఠ, వేల్పుల సుబ్రహ్మణ్యం. అల్లాడు రాజశేఖర్ రెడ్డిపాల్గొన్నారు. కడప : కడప నియోజకవర్గంలోని 48 డివిజన్‌లో పెన్షన్లను తొగట వీర క్షత్రియ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు మడక చక్రధర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సుబ్బారెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గోపవరం : బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో గోపవరం మండలంలోని భూమిరెడ్డిపల్లి, సంఘసముద్రం, గోపవరం, బేతాయపల్లె, రాసాయిపేటలలో ఎన్‌టిఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, జడ్‌పిటిసి కలువాయి జయరామిరెడ్డి వైఎస్ ఎంపిపి రామ్మోహన్‌రెడ్డి, కాల్వపల్లి సర్పంచ్ శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి, భూమిరెడ్డి పల్లె బివి రమణారెడ్డి, గోపవరం రామసుబ్బారెడ్డి సంటయ్య పాల్గొన్నారు. వల్లూరు : మండల కేంద్రంలోని పెద్దపుత్తా గ్రామంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి సోమవారం అవ్వ తాతలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యువ నాయకులు లక్ష్మిరెడ్డి, మండల టిడిపి అధ్యక్షులు ఎల్. నాగేశ్వర్ రెడ్డి, మండల నాయకులు టి.రాఘవరెడ్డి, టి.శ్రీనివాసులు రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, మధుసూదన్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
