చంద్రబాబు చెప్పిన వాగ్దానాలు అమలు చేయాలి

Mar 11,2025 17:32 #CPI

ప్రజాశక్తి – పుట్లూరు : సొంత ఇల్లు లేనివారికి వైస్సార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలలో ఒక్కటిన్నర సెంటు, పట్టణ లలో ఒకసెంటు ఇంటి స్థలం 32 లక్షల మందికి పట్టాలు ఇవ్వడం జరిగినా ఎక్కడ సంపుర్ణణంగా ఇంటి నిర్మాణం చేపట్టలేదు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు తాము అధికారం లోకి వచ్చిన వెంటనే గ్రామాలలో ముడు సెంట్లు, పట్టణ లలో రెండూసెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తాం అని అలాగే అనేకహామీలు ఇచ్చి అధికారం లోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన హామీలు ఒక పెన్షన్ తప్ప ఏ హామీని అమల చేయకపోవడం దారుణం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు సంవత్సరానికి 20వేల రూపాయల రైతు భరోస, తల్లికి వందనం ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్న అంతమందికి ఇస్తాం, నిరుద్యోగులకు 3000/-నిరుద్యోగ భృతి , 18,సం”నుంచి 59,,సం” వయసు వరకు ప్రతి ఆడబిడ్డకు నెలకి 1500/-రూ ” ఇస్తాం అని అనేక హామీలను ఇచ్చిన బడ్జెట్ సరిపడ నిధులు కేటాంచకుండా అంకెల గారడీ చెప్తూ హామీలు అమలు చేయకపోతే పెద్దఎత్తున ఆందోళలు చేయాల్సివస్తుంది. కావున సిఎం చెప్పినట్లు వాగ్దానం లో ఒక్కటైన పట్టణాలలో రెండూసెంట్లు, గ్రామాలలో ముడుసెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5,లక్షల రూపాయలు ఇచ్చి లబ్ధిదారులకు ఇసుక, ఇనుము, ఇటుక, సిమెంట్ ఉచితంగా ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

➡️