ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి) : నారాయణవనంలో శ్మశానం ప్రహరీ గోడ, దహనవాటిక ప్రారంభోత్సవం జరిగింది. శ్మశానాల అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయూతనిస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. బుధవారం ఉదయం నారాయణనం మేజర్ పంచాయతీ లో నిర్మించిన స్మశానానికి నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడ, దహాభావాటిక ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి పెట్టారు. అనంతరం స్మశాన వాటికకు ప్రహరీ గోడ, దహన వాటిక లను రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే ఆదిమూలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ … స్మశానాలు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల నాయకులు తన గ్రామాల్లోని స్మశానాలను అభివృద్ధి చేసుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు. అభివృద్ధి చేయవలసిన స్మశానాల వివరాలను తన దృష్టికి తీసుకువస్తే నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు, ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్, ఎంపీపీ దివాకర్ రెడ్డి, ఆర్డి ఏగంబరం, గోవింద్ స్వామి, రవి అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్మశానాల అభివృద్ధికి చంద్రన్న ప్రభుత్వం చేయూత : ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
