ప్రజాశక్తి-యర్రగొండపాలెం : ఐ టిడిపి కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై యర్రగొం డపాలెం పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నాయకులు గురు వారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి మాట్లాడుతూ వైౖసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాలతో పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ చౌడయ్యకు ఫిర్యాదు చేశారు. వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పి కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ షాబీర్‌బాషా, సర్పంచ్‌లు రామావత్ అరుణాబాయి, కర్నాటి వెంకటేశ్వరరెడ్డి, ఫిలిప్, పబ్బిశెట్టి శ్రీను, వైస్ ఎంపిపి ఎం ఆదిశేషు, మండల కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ సాదిక్, నాయకులు ఆంజజనేయులు, వెంకటేశ్వర్లు, ముజిబ్, జబివుల్లా, వెంకటేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, రాములు నాయక్, వెంకట్రామయ్య, శివరామిరెడ్డి, ఎమ్మెల్యే పిఏ కోటి తదితరులు పాల్గొన్నారు.
పెద్దదోర్నాల: ఐ టిడిపి కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై పెద్దదోర్నాల పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. వైౖసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుండారెడ్డి రమణారెడ్డి, వెన్నా బ్రహ్మారెడ్డి, గుంటూరు గాలిరెడ్డి, శివారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
