ప్రజాశక్తి- మార్కాపురం రూరల్ : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఉప వ్యవసాయ సంచాలకులు జి. లక్ష్మణ్ పేర్కొన్నారు. మార్కాపురం పట్టణంలోని పలు విత్తన దుకాణాల్లో వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప వ్యవసాయ సంచాలకులు లక్ష్మణ్ కుమార్, తిరుపతి విజిలెన్స్ సిఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ సరైన పత్రాలు లేకుండా విక్రయిస్తున్న విత్తనాల అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిపారు. దుకాణాల తనిఖీల్లో మార్కాపురం ఒంగోలు టెక్నికల్ ఎఒ శ్రీనివాస నాయక్, మార్కాపురం తర్లుపాడు ఎఒలు దేవిరెడ్డి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
