ప్రజాశక్తి-పామూరు: ప్రభుత్వ అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను నడిపితే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ హెచ్చరించారు. మంగళవారం పట్ట ణంలోని రెండు దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న పలు రకా ల ఐటమ్స్‌లను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. పర్మి షన్ లేకుండా ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో దుకాణాలు పెట్టినా, బాణాసంచా నిల్వ ఉంచినా సహించేది లేదన్నారు. వీటితోపాటు పర్మిషన్‌కు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట సిఐ భీమా నాయక్, ఎస్‌ఐ కిషోర్ బాబు పాల్గొన్నారు.
