తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌.వెంకయ్య చౌదరి ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగ నాయకులు మండపం వద్ద ఆయనకు పండితులు వేదాశీర్వచనం అందించగా అదనపు ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఎల్వో శ్రీ వరప్రసాదరావు, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్‌ శ్రీ రామకఅష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️