బాల్య వివాహం అడ్డగింత

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: ఒంగోలు శివారు ప్రాంతంలోని ఓ కాలనీలో బాల్య వివాహాన్ని పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. ఒంగోలు తాలూకా ఎస్‌ఐ సందీప్‌ సమాచారంతో జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్‌ కుమార్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి, హెల్ప్‌ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బివి సాగర్‌, మహిళ పోలీస్‌ స్టేషన్‌ ఏఎస్‌ఐ ఎన్‌.చంద్ర లీల, తాలూకా హెడ్‌ కానిస్టేబుల్‌ వై.బాధరియా స్థానిక మహిళా పోలీస్‌ యామిని, మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్‌ కె.ఆదిలక్ష్మి, అంగన్వాడి కార్యకర్తలు సంధ్యా, రత్నకుమారి బాల్య వివాహం జరిగే ప్రాంతానికి చేరుకుని వివాహాన్ని అడ్డుకున్నారు. ఇరుపక్షాల తల్లిదండ్రులకు, పెద్దలకు బాల్య వివాహం వల్ల జరిగే నష్టాలను వివరించారు. బాల్యవివాహం చేస్తే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారని వారికి అవగాహన కలిగించి బాలికకు 18 సంవత్సరాల వరకు వివాహం చేయకూడదని వారికి తెలియజేశారు. ఈ విషయాన్ని హెల్ప్‌ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ బివి సాగర్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాల కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు బి.పద్మావతి, జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యులు నీలిమ దష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సార్ట్స్‌ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️