బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

Dec 10,2024 15:00 #child marriage

ప్రజాశక్తి – ముద్దనూరు : బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ముద్దనూరు మహిళా పోలీసులు ఆకాంక్ష, శివజ్యోతి అన్నారు. స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం మహిళా పోలీసులు ఆకాంక్ష, శివజ్యోతి ఆధ్వర్యంలో బాల్య వివాహ నిరోధ కమీటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు రాజబాబు, శ్రీనివాసులు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేసే మత గురువులు, పెద్ద మనుష్యులు, తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారన్నారు. బాల్య వివాహాలపై టోల్ ఫ్రీ నెంబర్ 1098, ఐసిడిఎస్, పోలీసులు, మహిళా పోలీసులకు
ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ విజయ భాస్కర్, అంగన్వాడీ కార్యకర్తలు, ఎఎన్ఎమ్ లు,మత గురువులు పాల్గొన్నారు.

➡️