జిల్లాలో 31 బాల్య వివాహాలను ఆపాం : బాలల పరిరక్షణ జిల్లా అధికారి స్వప్న ప్రియదర్శిని

ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్‌ : జిల్లాలో బాల్య వివాహాల నిర్ములనపై ప్రత్యేక దఅష్టి సారించినట్లు జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్వప్న ప్రియదర్శిని తెలిపారు. మంగళవారం ఆమె ప్రజాశక్తితో పలు విషయాలను వెల్లడించారు. బాల్య వివాహాల వలన అనేక అనర్థాలు, సమస్యలు తలెత్తుతాయాని, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్‌ మసాల్లో బాల్య వివాహాల పైన ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి 31 వివాహలను ఆపడం జరిగిందన్నారు. బాల్య వివాహలపైన తల్లిదండ్రులలో అవగాహన కల్పిస్తున్నామని స్వప్న ప్రియదర్శిని పేర్కొన్నారు. బెంగళూరు, పశ్చిమ బెంగాల్‌, తెనాలి విజయవాడ వంటి ప్రాంతాల్లో మిస్సింగ్‌ పిల్లలను గుర్తించి వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు వారి గమ్యాలకు చేర్చినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకు ఈ నెల నుండి నవంబర్‌ 20 వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని, ఎవ్వరైనా పిల్లలను పనుల్లో పెట్టుకోవడం కాని, వెట్టి చాకిరీ చేయించిన అలాంటి యాజమాన్యలపైన కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఐసీడీ ఎస్‌ లో నిర్వహింప బడుతున్న ఐసీపీఎస్‌ మిషన్‌ వాత్సల్య కింద మార్పు చేయబడిందని అందులో శిశుగఅహ, చిల్డ్రన్స్‌ హోం ల నిర్వహణ ఉంటుందన్నారు. శిశు గృహలో అప్పుడే పుట్టిన అనాధ శిశువు నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు రక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే చిల్డ్రన్స్‌ హౌం లో 6 సంవత్సరాల నుండి 18 ఏళ్ల లోపు పిల్లలను ఉంచడం వారికీ అన్నిరకాల సదుపాయాలు కల్పించడం జరిగితుందని, వారికి విద్యబుద్దులు నేర్పించి పాఠశాలల్లో చేర్పంచడం జరుగుతుందని ఆమె తెలిపారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు శిశు గఅహలో ఉన్న పిల్లలను కారా నిబంధనలు అనుసరించి దత్తతకు సీనియర్టీ ప్రకారం ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే పిల్లలను దత్తతకు తీసుకోవాలి అనుకునే వారు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలని డి సి పి ఓ స్వప్న ప్రియదర్శిని తెలిపారు. జిల్లాలో బాలల పరిరక్షణే లక్ష్యంగా మిషన్‌ వాత్సల్య పని చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

➡️