ఈత కొలనులో చిన్నారుల కేరింతలు

ప్రజాశక్తి-దర్శి విద్యార్థులకు వేసవి సెలవు రావడంతో దర్శిలోని కురిచేడు రోడ్‌ ఎన్‌ఎస్‌పి కాలువ సమీపాన గల మోహన్‌ మిల్క్‌ లైన్‌ వద్ద ఈతకొలను చిన్నారులతో కిక్కిరిసిపోయింది. గురువారం సాయంత్రం సమయంలో చిన్నారులందరూ ఈతకొలనులో కేరింతలు కొడుతున్నారు. ఇటీవల ఎన్నికలు రావడంతో సుదూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులతో వచ్చిన చిన్నారులు కూడా ఈతకొలనులో ఈత కొడుతుండడంతో తల్లిదండ్రులు, చిన్నారులు ఆనందిస్తున్నారు. ఆదివారం, వేసవి సెలవుల్లో చిన్నారులందరూ ఇక్కడ ఈత కొట్టి ఆనందిస్తుంటారు. ఎన్నికల సమయంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ జెర్సీ వద్దకు వచ్చి ఆట వస్తువులు అయిన ఉయ్యాలలు జారుడుబల్లలు లాంటివి ఆడి ఆనంద పడుతుంటారు. అదేవిధంగా ఐస్‌ క్రీములు, స్వీట్లు కొనుక్కొని అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో తింటూ ఆస్వాదిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా వస్తుంటామని సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌ అనిల్‌ తెలిపారు. ఈ విధంగా పిల్లలతో ఈతకొలను నిండిపోయింది. ఇది దర్శిలో చిన్నారుల కోసం నిర్మించిన ఒకే ఒక ఈతకొలను కావటం విశేషం.

➡️