ఘనంగా చింతలూరు ఎంపీపీ పాఠశాల వార్షికోత్సవం

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని చింతలూరు ఎంపీపీ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి బి.అప్పాజీ హాజరై పాఠశాలలో వార్షిక పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్‌, సర్టిఫికెట్స్‌ బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్య వలన ఉత్తమ ఫలితాలు సాధ్యమని తెలిపారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించేలా స్నాతకోత్సవం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వుడత వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు వాసా నాగ వీర దుర్గాప్రసాద్‌, సిఆర్‌ఎంటి అపర్ణ పాల్గొన్నారు.

➡️