ఆర్టీసీ బస్సులో కార్యకర్తల తరలింపు..

Apr 2,2024 21:58
ఆర్టీసీ బస్సులో కార్యకర్తల తరలింపు..

ప్రజాశక్తి- సదుం: సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి సదుం మండలంలోని అమ్మగారిపల్లి గ్రామంకు చేరుకుని బస చేయనున్నారు. దీంతో వైసిపి నాయకులు ఘనంగా ఏర్పాట్లు చేయడంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా మదనపల్లిలో సిఎం సభను విజయవంతం చేయడానికి సింగిల్‌విండో ఛైర్మన్‌ సిఎం తిమ్మారెడ్డి, వైస్‌ఛైర్మన్‌ పెద్దిరెడ్డి రమేష్‌ రెడ్డి, తిమ్మానాయునిపల్లి సర్పంచ్‌ లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో సదుం నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉదయం వైసిపి నాయకులు, కార్యకర్తలను తరలించారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా బస్సు యాత్రకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించారు. ట్రాఫిక్‌ను సోమల నుంచి నంజంపేట మీదుగా మళ్లించారు. అలాగే చీకలచేను మీదుగా కల్లూరు వైపు, తిరుపతి నుండీ సదుంకు, సదుం నుండీ కందూరు రోడ్డు మీదుగా మదనపల్లి వైపు బస్సులను మల్లించినట్లు ఎస్‌.ఐ మారుతి తెలిపారు.

➡️