జగన్‌ మావయ్యా… సభకు బస్సులు.. బడికి మేమెలా..?

Apr 2,2024 21:57
జగన్‌ మావయ్యా... సభకు బస్సులు.. బడికి మేమెలా..?

శ్రీ 56 బస్సులకు గాను 40 తరలింపుశ్రీ అవస్థలు పడ్డ విద్యార్థులు, ప్రయాణికులుశ్రీ బస్సు కోసం గంటల తరబడి ఎండలోనే ఎదురుచూపుప్రజాశక్తి- పలమనేరు : పలమనేరు పట్టణంలోని ఆర్టీసీ డిపోకు చెందిన 40 బస్సులను మదనపల్లెలో జరిగే జగన్‌ మోహన్‌ రెడ్డి మేము సిద్ధం సభకు తరలించారు. దీంతో రోజూ ఉదయాన్నే బడులు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. డిపోలో మొత్తం 56 బస్సులు ఉండగా సభకు 40 బస్సులను వైసిపి నాయకులు బుక్‌ చేసుకుని పలమనేరు నుంచి కార్యకర్తలను మదనపల్లెకు తరలించారు. దీంతో మిగిలిన 16 బస్సుల్లోనే విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులు సమయానికి బడులకు, కాలేజీలకు వెళ్లలేక ఎండలోనే ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఇలా సభలకు ఆర్టీసీ బస్సులను పంపేటప్పుడు విద్యార్థులకు సెలవు ఇవ్వొచ్చుకదా అంటూ తల్లిదండులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️