జిల్లా అడిషనల్‌ ఎస్‌స్పీగా ఏవి.సుబ్బరాజు

Feb 5,2024 20:50

జిల్లా అడిషనల్‌ ఎస్‌స్పీగా ఏవి.సుబ్బరాజు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జిల్లాలో 4వ అడిషనల్‌ ఎస్‌పి, ఎస్‌ఈబిగా ఏవి.సుబ్బరాజు సోమవారం మిట్టూరులోని ఎక్సైజ్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎక్సైజ్‌ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం జిల్లాకు చెందిన ఏవి.సుబ్బరాజు 1989 బ్యాచ్‌లో ఎస్సైగా పోలీసుశాఖలో చేరారు. ఎస్‌ఐగా పలుచోట్ల పనిచేసి 2001లో సిఐగా పదోన్నతి పొంది శ్రీకాకుళం జిల్లాలో 7సంవత్సరాలు విధులు నిర్వహించారు. 2010లో డిఎస్పీగా విజయనగరం సిఐడి, ఎస్‌బి, ఇంటలిజెన్స్‌, విశాఖపట్నంలో ఏసిబి, పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ విజయనగరంలో పనిచేసి 2020లో అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి పొంది మొదటగా ఏలూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌గా, వెస్ట్‌ గోదావరి జిల్లా భీమవరంలో అడ్మిన్‌గా పనిచేశారు. చిత్తూరు జిల్లా 4వ అడిషనల్‌ ఎస్పీ ఎస్‌ఈబిగా సోమవారం బాధ్యతలు చేపట్టారు.

➡️