దళితుల భూమిని కాజేశారు..అడిగితే దాడి చేశారు..!

దళితుల భూమిని కాజేశారు..అడిగితే దాడి చేశారు..!

దళితుల భూమిని కాజేశారు..అడిగితే దాడి చేశారు..!ప్రజాశక్తి -గంగవరం: దళితుల భూమిని అగ్రకుల పెత్తం దారులు అన్యాయంగా కాజేయడమే కాకుండా ప్రశ్నిస్తే దళితులపైనే దాడి చేసిన సంఘటన గంగవరం మండలం గండ్రాజుపల్లి వద్ద ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు శ్రీనివాసులు, లక్ష్మమ్మ కథనం మేరకు గండ్రాజుపల్లి వద్ద సర్వేనెంబర్‌ 189/1 ఎ లో 1.42 సెంట్లు వ్యవసాయ భూమి తన తండ్రి సూర మునెప్ప, ఆరెప్ప, గంగప్పలది ఉమ్మడి ఆస్తి అని వివరించారు. ఈ భూమిని లక్ష్మీపతి నుండి కుమార్‌ దాస్‌ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు చెపుతున్నాడని తెలిపాడు. తమ భూములను ఇప్పటి వరకు ఎవరికీ విక్రయించలేదని బాధితుడు వాపోయాడు. ఈనెల 21వ తేదీన కుమారు దాస్‌ భూమిలో మట్టి తోలుతున్నట్లు తెలుసుకొని తనతో పాటు లక్ష్మమ్మ, శ్యామల, సీతమ్మ నాగరత్నమ్మ, వికలాంగులైన వెంకటేష్‌, వెంకట రమణ భూమి వద్దకు వెళ్లి కుమార్‌ దాసును అడుగుతుండగా రెచ్చిపోయి తనను, తమ ఆడవాళ్లను కొట్టి బెదిరించాడని తెలిపారు. తమపై కసి తీర్చుకోవడానికి దళితులను రెచ్చగొట్టి మట్టి తోలుతున్న చలపతి , గట్టప్ప ,రంగయ్యలను ట్రాక్టర్లు నిలిపివేయాలని అడుగుతుండగా వారు సైతం తమపై దాడి చేసి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గంగవరం పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.

➡️