నులిపురుగును నులిమేద్దాం: డీఎంహెచ్‌వో

Feb 9,2024 22:51
నులిపురుగును నులిమేద్దాం: డీఎంహెచ్‌వో

శ్రీ జిల్లాలో 3,63,556మందికి అల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: పిల్లలలో నులిపురుగుల ఉండడం వల్ల వారిలో రక్తహీనత, నీరసంగా ఉండడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్‌ ప్రభావతి దేవి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రవేటు పాఠశాలలో జిల్లా విద్య శాఖ ఏడి విజయేంద్రరావుతో కలసి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రలు మింగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలలో నులిపురుగుల ఉండడం వల్ల వారు రక్తహీనత, నీరసంగా ఉండడంతో పాటు తరుచుగా అనారోగ్యా బారిన పడడం జరుగుతుందని, అందుకోసం ప్రతి సంవత్సరం 1నుండి 19సంవత్సరాల లోపు పిల్లలు అందరు అల్బెండజోల్‌ మాత్రలు మింగాలన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లల భవిష్యత్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన వైద్య సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 2420అంగన్వాడీ కేంద్రాలు, 2680 ప్రభుత్వ ప్రాథమిక, హైస్కూల్‌లు, 137ప్రభుత్వ, ప్రవేటు కళాశాలలలోని 3,63,556 మంది పిల్లలకు, సిబ్బంది అందరూ ఈ మాత్రలు మింగించడం జరుగుతోందన్నారు. శుక్రవారం వేసుకొని వారికి ఈ నెల 16న వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ శిరీష, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ లోకేష్‌, ఎంఈవో సెల్వరాజ్‌, వైద్య అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️