పెండింగ్‌ కేసులు వేగవంతంగా పరిష్కరించాలిజిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ భీమారావు

Apr 1,2024 00:33
పెండింగ్‌ కేసులు వేగవంతంగా పరిష్కరించాలిజిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ భీమారావు

పెండింగ్‌ కేసులు వేగవంతంగా పరిష్కరించాలిజిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ భీమారావుప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌ : జిల్లాలో వివిధ కోర్టులలో పెండింగ్‌ లో ఉన్న సివిల్‌, క్రిమినల్‌ అన్ని రకాల కేసులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ భీమారావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం జెడ్పీ మీటింగ్‌ హాలులో అడ్మినిస్ట్రేషన్‌, సివిల్‌, క్రిమినల్‌ కేసులు పరిష్కారానికి సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జ్యూడిషియల్‌ ఆఫీసర్స్‌కు నిర్వహించిన కాన్ఫరెన్స్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ కోర్టులలో పెండింగ్‌ లో ఉన్న వివిధ రకాల సివిల్‌, క్రిమినల్‌ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని సంబంధిత జ్యూడిషియల్‌ ఆఫీసర్స్‌ను ఆదేశించారు. హై కోర్టు ఆదేశాల మేరకు జిల్లా జ్యూడిషల్‌ అధికారులతో సమావేశాన్ని జిల్లా కేంద్రంలో మూడు నెలలకు ఓ సారి నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 63 కోర్టులు పనిచేస్తున్నాయని, వీటిలో ఒక ప్రిన్సిపల్‌ జిల్లా కోర్టు, 14 అదనపు జిల్లా అండ్‌ సెషన్స్‌ జడ్జిల కోర్టులు, 11 సీనియర్‌ సివిల్‌ జడ్జిల కోర్టులు, 33 జూనియర్‌ సివిల్‌ జడ్జిల కోర్టులు, 4 స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులు ఉన్నాయని తెలిపారు. 28 ఫిబ్రవరి 2024 నాటికి జిల్లాలో 91,221 వివిధ రకాల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో 46,938 సివిల్‌ కేసులు, 44,283 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 91,221 నుండి 90,652 గత జ్యుడీషియల్‌ ఆఫీసర్స్‌ కాన్ఫరెన్స్‌ నుండి ప్రస్తుత జ్యుడీషియల్‌ ఆఫీసర్స్‌ కాన్ఫరెన్స్‌ వరకు 569 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. భూములకు సంబంధించి, క్రిమినల్‌ కేసులకు సంబంధించి రెవెన్యూ, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకొని వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత కేసుల పరిష్కారానికి కలెక్టర్‌, సంబంధిత అధికారులతో కో-ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించామని తెలిపారు. జిల్లాలో కొత్త 15 కోర్టుల బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి హైకోర్టు అనుమతి ఇచ్చిందన్నారు. ఈ భనాల నిర్మాణం, లిఫ్ట్‌ పనులు , ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులు మినహా పూర్తయిందని, మిగిలిన పనులను రెండు రోజుల్లో పూర్తవుతాయని తెలిపారు. ప్రతిరోజూ లోక్‌ అదాలత్‌ లు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో 161 న్యాయ అక్షరాస్యత శిబిరాలు నిర్వహించామని, ఏడు కేసులలో న్యాయ సహాయం అందించామన్నారు. రెండవ శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌లను నిర్వహిస్తున్నామని, చిత్తూరు జిల్లాలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌ లో ఎక్కువ కేసులు పరిష్కరించడంతో సంతప్తిగా వుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ కోర్టుల పరిధిలో ఎక్కువ కేసులు పరిష్కరించిన జడ్జిల ను అభినదించారు. ఈ సమావేశంలో ఆదనపు జిల్లా జడ్జి రమేష్‌, అదనపు జిల్లా జడ్జి అన్వర్‌ బాషా, ఫాక్స్‌ కోర్టు అదనపు జిల్లా జడ్జి శాంతి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి , సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ ఐ కరుణ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️