పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసిన కమిషనర్‌

Feb 13,2024 22:10
పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసిన కమిషనర్‌

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: నగరపాలక సంస్థ పరిధిలో పోలింగ్‌ కేంద్రాలను ఏఈఆర్వో, కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ మంగళవారం ఉదయం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పోలింగ్‌ కేంద్రాల్లో నిర్దేశించిన సౌకర్యాలు కల్పన, చేపట్టిన పనులను పరిశీలించారు. నగరపాలక పరిధిలో షర్మన్‌ బాలిక ఉన్నతపాఠశాల, సీకే.పల్లి ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఐటిఐ, బ్రిడ్జి స్కూల్‌, గాండ్లపల్లి ఉన్నత పాఠశాలలోని 11 పోలింగ్‌ కేంద్రాలను కమిషనర్‌ తనిఖీ చేశారు. ప్రధానంగా నీటిసరఫరా, విద్యుత్‌, ఫర్నిచర్‌, మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణాలను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో నిర్దేశించిన పనులు వేగంగా పూర్తి చేసేలా ఇంజనీరింగ్‌ విభాగం ఏఈలు, డీఈలు సత్వరం చర్యలు చేపట్టాలన్నారు. జరుగుతున్న పనులను రోజువారిగా పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈ గోమతి, డీఈలు వెంకట ప్రసాద్‌, రమణ, ఏఈలు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️