ప్రకృతి వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించండిసిఐటియు ఆధ్వర్యంలో యూనియన్‌ ఏర్పాటు

ప్రకృతి వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించండిసిఐటియు ఆధ్వర్యంలో యూనియన్‌ ఏర్పాటు

ప్రకృతి వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించండిసిఐటియు ఆధ్వర్యంలో యూనియన్‌ ఏర్పాటుప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌ : జిల్లాలో అగ్రికల్చర్‌ డిపార్టుమెంట్లో ప్రకృతి వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు. ఆదివారం చిత్తూరులో జిల్లాలోని కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్‌ ఏర్పాటు చేసుకొని నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వాడ గంగరాజు మాట్లాడుతూ గత 14 నెలలుగా వేతన బకాయిలు వుండడంతో వారి కుటుంబ పరిస్థితి దుర్భరంగా మారిందని వారికి వెంటనే వేతనాలు ఇవ్వాలని కోరారు. క్షేత్ర స్థాయిలో రైతులకు ప్రకతి వ్యవసాయంపై చైతన్యం కలిగిస్తూ వారు పండించే పంటలకు ప్రకతి వ్యవసాయం పద్ధతిలో చేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఇలాంటి వారికి తీవ్ర సమస్యలు వున్నాయని వారి సమస్యలపై భవిష్యత్తులో వేతనాలు పెంపు కోసం, ఉపాధి కోసం అందరూ ఐక్యంగా యూనియన్‌ ఏర్పాటు చేసుకున్నారన్నారు. దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలపై నిరంతరం సిఐటియు చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై సిఐటియులో చేరామని కార్మికులు తెలిపారు.నూతన కమిటీ ఎన్నిక నేచురల్‌ ఫార్మింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు అనుబంధంగా చిత్తూరు జిల్లాలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా వాడ గంగరాజు, అధ్యక్షులుగా నాగరాజు, కార్యదర్శిగా ప్రతాప్‌, కోశాధికారిగా హనుమంత్‌ రెడ్డి, ఉపాధ్యక్షులుగా భారతి , నీలకంఠ రెడ్డి, మురళి, ఓబులేష్‌, సహాయ కార్యదర్శులుగా రమేష్‌ , రూప, చంద్రయ్య, రెడ్డమ్మ లతోపాటు 15 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

➡️