ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందిస్తాం..- దేవరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందిస్తాం..- దేవరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందిస్తాం..- దేవరాజు, జిల్లా విద్యాశాఖ అధికారిఇంటర్వ్యూప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపొందించేందుకు కషి చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు తెలిపారు. మూడు రోజుల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన దేవరాజులును ‘ప్రజాశక్తి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల ఫలితంగా ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల రూపురేఖల్లో మార్పులు వచ్చాయని ‘నాడు- నేడు’తో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణం, అదనపు తరగతి గదులు, పాఠశాలలకు రంగులు వేయడం వల్ల కార్పొరేట్‌ పాఠశాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా నేడు ప్రభుత్వ పాఠశాలలు ఆకర్షణీయంగా తయారయ్యాయన్నారు. పలు ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చారు.ప్రశ్న: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయా?సమాధానం: విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా అడ్మిషన్ల సంఖ్య పెరుగుతోంది. ప్రాథమిక పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది.ప్రశ్న: పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?సమాధానం: పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకోసం ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ చదువులో వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దష్టి సారిస్తూ మంచి ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. గత ఏడాది కంటే ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం.ప్రశ్న: ప్రభుత్వ పాఠశాల విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు….?సమాధానం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయ సంఘాలు, డివైఈవోలు, ఎంఈఓ ల సహకారం ఎంతో అవసరం. అందరి సహకారం తీసుకొని విద్యా ప్రమాణాల పెంపునకు కషి చేస్తున్నాం.ప్రశ్న: మధ్యాహ్న భోజనం అమలు తీరు ఎలా ఉంది?సమాధానం: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేలా జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు సకాలంలో జీతాలు బిల్లులు అందేలా చూస్తాం.ప్రశ్న: జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టారు విద్యాశాఖలో ఎలాంటి మార్పులు ఉండాలని కోరుకుంటున్నారు?సమాధానం: రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొచ్చిన మార్పులతో విద్యా ప్రమాణాలు బాగా పెరిగా యి. ఉపాధ్యాయుల శిక్షణ వేసవి సెలవుల్లోనే నిర్వహిం చేలా ఉపాధ్యాయ సంఘాల తో చర్చిస్తాం. నేడు విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ సహకారం తో విద్యార్థులు చక్కటి విద్య ను అభ్యసించి అత్యుత్తమ పౌరులుగా తయారు కావా లని ఆశిస్తున్నా.

➡️