మళ్లీ తెరపైకి కలత్తూరు కపా లక్ష్మి!

మళ్లీ తెరపైకి కలత్తూరు కపా లక్ష్మి!ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో జీడి నెల్లూరు నియోజకవర్గంలో రకానికి ఒక పేరు మారుతుంది. ఊసరవెల్లిలా జీడి నెల్లూరు రాజకీయం మారుతోంది. మొదట్లో డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి అభ్యర్థిని ప్రకటించారు. నారాయణస్వామి పై వ్యతిరేకత రావడంతో ఆయన కూతుర్ని కలతూరు కపా లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆ కుటుంబంలో ఎవరైనా ఒకటే కదా మాకందరికీ మోసం చేస్తారు.. వద్దు’ అని వైసిపి నాయకులే ధర్నాలు చేశారు. మళ్లీ జగన్మోహన్‌ రెడ్డి అభ్యర్థిని మార్చారు. చిత్తూరు సిట్టింగ్‌ ఎంపీ రెడ్డప్పని జీడి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. ‘ఇక్కడ నేను ఓడిపోతాను.. నేను స్థానికుడిని కాను అని’ ఆయన చెప్పడంతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చిత్తూరు పార్లమెంట్‌ కి బదిలీ చేశారు. ‘ఇక్కడ నేను గెలవలేను’ అని చెప్పడంతో చివరికి ఆమె పెద్ద కుమార్తె కలత్తూరు కపాలక్ష్మికి సీటు కేటాయించారు.

➡️