రికార్డులు బ్రేక్‌…

Apr 1,2024 22:04
రికార్డులు బ్రేక్‌...

శ్రీ 2023-24కు రూ.18.57 కోట్లు వసూలుశ్రీ కమిషనర్‌ హయాంలో గణనీయంగా పెరిగిన పన్నుల వసూళ్లు ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: పన్నుల వసూళ్లలో చిత్తూరు నగరపాలక సంస్థ వరుసగా రెండో ఏడాది రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. గత రికార్డులను తిరగరాస్తూ గరిష్ట స్థాయిలో ఆస్తి, ఖాళీ స్థలాల పన్నుల వసూళ్లు సాధించింది. నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ ఆధ్వర్యంలో ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకు వెళ్లిన రెవెన్యూ యంత్రాంగం రికార్డుస్థాయిలో పన్నుల వసూలు సాధించింది. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2024, మార్చి 31వ తేదీ నాటికి గరిష్ట స్థాయిలో 18.57కోట్ల మేర పన్నులు వసూలు చేశారు. గత ఏడాది (2022-23) ఇదే సమయానికి మొత్తం డిమాండ్లో 79 శాతం పన్నులు వసూలు సాధించగా.. 2023-24లో 80 శాతం సాధించడం విశేషం. రెండేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుత చేసిన పన్నుల వసూళ్లు దాదాపుగా రెట్టింపు. చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ ఆధ్వర్యంలో పన్నుల వసూలు కార్యక్రమం ప్రణాళికాబద్ధంగా సాగింది. ముందస్తుగా నిర్దేశించుకున్న యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం ప్రత్యేక బందాల ఆధ్వర్యంలో పన్నులు వసూళ్లు చేపట్టారు. ప్రధానంగా దీర్ఘకాలికంగా, పెద్దమొత్తంలో ఉన్న బకాయిలపై ప్రత్యేకదష్టి సారించారు. అధికారులు నిత్యం పన్ను చెల్లింపుదారులను కలిసేలా చర్యలు తీసుకున్నారు. గత ఎడాది ఇదే తరహా ప్రణాళికతో పాత బకాయిలను విజయవంతంగా వసూలు చేశారు. దీంతో 2023-24 సంవత్సరానికి డిమాండ్‌ గణనీయంగా తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.35 కోట్లు డిమాండ్‌ ఉండగా.. కమిషనర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బందాలు రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో విస్తతంగా తిరిగి రూ.27.72 కోట్లు వసూలు చేశారు. ఇందులో పాత, మొండి బకాయిలే ఎక్కువ. ఫలితంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి డిమాండ్‌ గణణీయంగా తగ్గి రూ.23.21 కోట్లకు చేరింది. ఈ సంవత్సరం కమిషనర్‌ అరుణ ఆధ్వర్యంలో రెవెన్యూ యంత్రాంగం గడిచిన మూడు నెలల నుండి క్షేత్రస్థాయిలో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దష్టి సారించింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మాఫీ ప్రకటించడంతో మార్చి నెలలో పన్నులు వసూళ్ల వేగాన్ని మరింత వేగవంతం చేశారు. ఫలితంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.18.57 కోట్లు పన్నుల వసూలు చేపట్టారు. ఆఖరి రోజైన ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.1.53కోట్లు పన్నులు వసూలైంది.వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకున్నారు.. ఆస్తి, ఖాళీ స్థలంకు సంబంధించి పన్నులపై ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయడంతో మెజారిటీ పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వడ్డీ మాఫీ ప్రకటన వెలువడిన మార్చి నెలలో రూ.5.44 కోట్లు పన్నులు వసూళ్ళు కాగా ఇందులో సుమారు మూడు కోట్లు పాత బకాయిలే కావడం గమనార్హం. నగరపాలక సంస్థకు సకాలంలో పన్నులు చెల్లించిన పన్ను చెల్లింపుదారులకు కమిషనర్‌ అరుణ కతజ్ఞతలు తెలిపారు. పన్నుల వసూళ్లకు కషిచేసిన రెవెన్యూ అధికారులు, వార్డు కార్యదర్శులను అభినందించారు.

➡️