‘వివేకానంద’ విజయదుందుభి

Feb 13,2024 22:09
'వివేకానంద' విజయదుందుభి

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ ఎన్‌టిఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్‌ 2024 ఫలితాల్లో నగరంలోని స్థానిక పీఎస్‌ఎన్‌ వివేకానంద జూనియర్‌ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారని కళాశాల కరస్పాండెంట్‌ పి.సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌ నాగరాజ తెలిపారు. జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో పి.చరిత్‌ చౌదరి 99.17 శాతం మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారని తెలిపారు. ఈ విద్యార్థిని కళాశాల కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌, అధ్యాపక బందం మంగళవారం స్థానిక కళాశాలలో అభినందించారు. ఈసందర్భంగా కరస్పాండెంట్‌ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు చక్కటి బాటలు వేస్తూ పిఎస్‌ఎన్‌ వివేకానంద జూనియర్‌ కళాశాల చిత్తూరు నగరంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందని తెలిపారు. తమ కళాశాలలో 2024 జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో 47మంది విద్యార్థులు 80 శాతం సాధించారని మొదటి స్థానంలో చరిత్‌ చౌదరి 99.17 సాధించగా, రిత్విక్‌ రాజ్‌ 97.32, నిహిత్‌ 96.59, ప్రీతి 96.12, చందన 95.01, మహమ్మద్‌ సఫ్వాన్‌ 94.58, పవన్‌ 94.24, తేజసాయి 94.09, సింధు 93.44, రిషికేశ్‌ రామ్‌ 92.21, తారాచంద్ర చౌదరి 91.79, దుర్గా ప్రసన్న 91.05, చాందిని 90.77, సంతోష్‌ చౌదరి 89.96, మౌనిక 89.55 శాతం ర్యాంకులు సాధించారని తెలిపారు.

➡️