సమస్యలు.. ఇంతింత కాదయా.!

Feb 12,2024 22:50
సమస్యలు.. ఇంతింత కాదయా.!

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో ప్రజలు స్పందన కార్యక్రమంలో విన్నవించుకున్నారు. వారి సమస్యలను వివరిస్తూ.. పరిష్కరించాలని జిల్లా అధికారులను కోరారు. మరో వైపు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట కార్మిక సంఘాలు, వివిద సమస్యలతో వచ్చిన ప్రజలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టరేట్‌ స్పందనకు 212అర్జీలుస్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పథకసంచాలకులు ఎన్‌.రాజశేఖర్‌ పేర్కొన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో స్పందన హాల్‌లో డిప్యూటీ కలెక్టర్‌ భవాని, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మిప్రసన్నతో కలిసి అర్జీలను స్వీకరించారు. శాఖల వారీగా రెవెన్యూశాఖకు సంబంధించి 156, జిల్లా ఉపాధి కల్పన శాఖ 3, పోలీసుశాఖ 12, విద్యాశాఖ 1, డిఆర్‌డిఏ 2, జిల్లా పంచాయత్‌ 1, ఎపిఎస్‌పిడిసిఎల్‌ 5, ఫారెస్ట్‌శాఖ 2, మెప్మా 1, ఎపియంఐపి 1, డియంఅండ్‌హెచ్‌ఓ 1, జిల్లా రిజిస్ట్రార్‌ 1, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం కార్వేటినగరం 1, యల్‌డియం 2, సర్వే 2, పలమనేరు మున్సిపాలిటీ 1, నగర పాలక సంస్థ చిత్తూరు 1, ప్రొబేషనరీ ఎక్సైజ్‌శాఖ 1, నేషనల్‌ హైవే 1, ఎంపీడీవోలు గంగవరం 1, జిడి నెల్లూరు 1, గుడిపాల 1, హౌసింగ్‌శాఖ 1, ఏపిఎస్‌ఆర్‌టిసి 1, ఇతరులు 12 వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు తమ సమస్యల అర్జీలను అధికారులకు అందజేశారు. ప్రజల నుంచి వినతులకు పరిష్కారం చూపుతామని, ఆ మేరకు అధికారులను ఆదేశించినట్లు డ్వామా పీడీ రాజశేఖర్‌ తెలిపారు.నగరపాలక కార్యాలయానికి 4వినతులు చిత్తూరు నగరపాలక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో నాలుగు వినతులు అందినట్లు కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ తెలిపారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు.. సహాయ కమిషనర్‌ గోవర్థన్‌ స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ విభాగం-3, ప్రజారోగ్య విభాగం -1 చొప్పున మొత్తం నాలుగు వినతులు అందాయి. వినతులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈ గోమతి, డీఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.పోలీస్‌ స్పందనకు 18 ఫిర్యాదులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో 18 ఫిర్యాదులు చేరాయి. వాటికి నిర్దేశించిన గడువులోగా పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ జాషువా ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్‌పీని, అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ ఆరిఫుల్లాని, డి.టి.సి డి.ఎస్పీ శ్రావణ్‌కుమార్‌ని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలకు పరిష్కారం చూపుతామని బాధితులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో మొత్తం 18 ఫిర్యాదులు అందగా భర్త వేదింపులు 2, భూ తగాదాలు 9, ఆస్తి తగాదాలు 3, చీటింగ్‌ 4 ఉన్నాయి.ఊరికి దారి కల్పించాలని.. తమ గ్రామానికి దారి సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం కొల్లాఊరుకు చెందిన గ్రామస్తులు కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం అక్కడే నిరసన తెలియజేశారు. జీడీ నెల్లూరు మండలం కుట్రకోన పంచాయితీకి చెందిన కొల్లాఊరు గ్రామానికి దారిలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తమ గ్రామంలో 70కుటుంబాలు నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నదారిలో కూడా పక్కన రైతులు పూర్తిగా కాలిబాట మాత్రం మిగిలిందని ఊరికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే అంబులెన్స్‌ కూడా సౌకర్యం లేదని వెంటనే తమ బాధలు అర్థం చేసుకొని దారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.హమాలీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని.. ఏపీ హామాలి ముఠా జట్టు కాలసి వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఏఐటియుసి నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.రమాదేవి నాయకత్వంలో హామాలి కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్‌.నాగరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 50కోట్ల మంది అసంఘటిత పనిచేస్తూ ఉన్నారన్నారు. అందులో రాష్ట్రంలో సుమారు 25లక్షలు మంది హమాలీ కార్మికులు పనిచేస్తున్నారని వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి రాయితీలు సదుపాయాలు అందకపోవడం బాధాకరమన్నారు. హమాలి హెడ్‌ లోడ్‌ యాక్ట్‌ చట్టం కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నదని మన రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు మాదిరిగానే హ మాలి కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా హమాలీ కార్మికులకు వర్తింపజేస్తూ సంవత్సరానికి ఒకసారి ప్రతి జిల్లాలో హెల్త్‌ క్యాంపులో నిర్వహించాలని హమాలి కార్మికులకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.పారిశుధ్య కార్మికుల హామీలపై జీవో విడుదల చేయాలని.. మున్సిపల్‌ పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు జీవోను విడుదల చేయాలని సోమవారం రాష్ట్ర సంఘం పిలుపుమేరకు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ గౌరవ అధ్యక్షులు ఎస్‌.నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ పరిశుద్ధ కార్మికులు, ఇంజనీర్‌ విభాగం కార్మికులు సమస్యల పరిష్కారం కానందున రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయడంతో ప్రభుత్వం స్పందించి రాష్ట్ర కార్మిక సంఘం నాయకులను చర్చలు ఆహ్వానించి చర్చించిన తర్వాత ప్రభుత్వం కార్మికులకు కొన్ని హామీలు ఇచ్చి మినిట్స్‌ ఒప్పందం చేసుకున్నదన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని జీవో ద్వారా విడుదల చేయడంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఇచ్చిన హామీల మేరకు జీవోలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ నాయకత్వంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.దళితుల పట్టా భూమిలో శవాలను పూడ్చడం నేరమా..- జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలి అనుపుపల్లి సర్వే నంబర్‌ 167/1దళితులకు సంబంధించిన పట్టా భూమిలో శవాలను పూడ్చడం అన్యాయమని సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్‌పిఎస్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీహెచ్పీఎస్‌, డిహెచ్పిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ దళితులకు ప్రభుత్వం, సంబంధిత రెవెన్యూ అధికారులు స్మశాన వాటికలను ఏర్పాటు చేయడంలో మాకు వ్యతిరేకం కాదని జిల్లాలో ప్రతి దళితవాడకు స్మశాన వాటిక ఏర్పాటు చేయాలన్నారు. అందులో మౌలిక వసతులు కల్పించాలని స్మశాన వాటికలో కబ్జా గురికాకుండా ఆక్రమణలకు గురి కాకుండా ప్రహరీ గోడలను నిర్మించాలని కోరుకుంటున్నామన్నారు. కానీ దళితులకు సంబంధించిన పట్టా భూమిలో ఉద్దేశపూర్వకంగా శవాలను వేయడం దీనికి అధికారులు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని సూటిగా ప్రశ్నించారు.

➡️