హత్య కేసులో నిందితుల అరెస్టు

Feb 12,2024 22:52
హత్య కేసులో నిందితుల అరెస్టు

శ్రీ వివాహేతర సంబంధమే కారణమన్న పోలీసులుశ్రీ హత్యలో పాత్రదారులైన ఎనిమిది మంది అరెస్ట్‌శ్రీ సీఐని ప్రశంసించిన డీఎస్పీప్రజాశక్తి-చిత్తూరు డెస్క్‌: నగరి మున్సిపాలిటీ, నెత్తం కండ్రిగ లక్ష్మీపురంలో ఈనెల 3న వాటర్‌ప్లాంట్‌ యజమాని ఎం.జగధీష్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో నరికి చంపిన కేసును నగరి పోలీసులు 9రోజుల్లో చేధించారు. హత్యలో పాత్రదారులైన నెత్తకండ్రిగకు చెందిన సుధాకర్‌(40), సత్యవేడు, దాసుకుప్పంకు చెందిన మురళి(37), తిరువళ్లూరు రామదాసుపురంకు చెందిన యస్‌.మగేష్‌(40), తిరుపాచూరుకు చెందిన ఎ.అజిత్‌(27), కడంబత్తూరు అధిగాత్తూరుకు చెందిన హరిహరన్‌కుమార్‌ అలియాస్‌ వసంత్‌(23), సూట్‌సూరి(20) రాజముత్తు(24), మనవాల్‌నగర్‌కు చెందిన జయశంకర్‌ బాలాజి (24)లను అరెస్ట్‌ చేశారు. సోమవారం నిందితులను అరెస్టు చూపారు. డీఎస్పీ నరసింహమూర్తి తెలిపిన వివరాల మేరకు వివాహేతర సంబంధమే హత్యకు కారణమైంది. ఆ కోణంలోనే సుధాకర్‌ అనే వ్యక్తిపై అనుమానంతో కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు సోమవారం ఉదయం గుండ్రాజుకుప్పం డంపిగ్‌ యార్డువద్ద సుధాకర్‌ను అతనితో పాటు ఉన్న ఏడుగురిని అదుపులో తీసుకొని అసలు విషయాన్ని రాబట్టారు. సుధాకర్‌ అద్దెకున్న ఇంటి యజమాని జగధీష్‌కు వివాహేతర సంబందం ఏర్పడం ఈ కారణంగా వివాదాలు, గొడవలు ఏర్పడి సుధాకర్‌ భార్యకు విడాకులకు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయినా మానసికంగా జగధీష్‌పై సుధాకర్‌ కక్షపెంచుకున్నాడు. తనకు వరుసకు సోదరుడైన సత్యవేడు మండలం, దాసుకుప్పం గ్రామానికి చెందిన మురళితో జగదీష్‌ను చంపేందుకు రూ.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం మేరకు మురళి తన సన్నిహితుడైన మగేష్‌ ద్వారా తమిళనాడుకు చెందిన అజిత్‌, హరిహరన్‌, వసంత్‌, సూరి, ముకేష్‌లను రంగంలోకి దింపి హత్యకు పథకరచన చేశాడు. 3వ తేది రాత్రి జగధీష్‌ కారుదిగి ఇంటికి వెళ్లేసమయంలో అక్కడే పొదల చాటున దాక్కున్న వసంత్‌ వేటకత్తితో దాడిచేయడంతో జగధీష్‌ మతిచెందాడు. విచారణంలో నిందితుల వద్ద నుంచి రూ.1.37లక్షల నగదు, సెల్‌ఫోన్లు, వేటకత్తిని స్వాధీనం చేసుకొని కోర్టుకు హాజరుపరిచారు. కేసును త్వరగా చేధించిన సీఐ సురేష్‌ను డీఎస్పీ ప్రశంసించారు.

➡️