అక్రమంగా తొలగించిన అంగన్వాడీలు విధుల్లోకి..సిఐటియు విజయం చొరవ తీసుకున్న కలెక్టర్‌కి అభినందనలు: యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వాడ

అక్రమంగా తొలగించిన అంగన్వాడీలు విధుల్లోకి..సిఐటియు విజయం చొరవ తీసుకున్న కలెక్టర్‌కి అభినందనలు: యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వాడ

అక్రమంగా తొలగించిన అంగన్వాడీలు విధుల్లోకి..సిఐటియు విజయం చొరవ తీసుకున్న కలెక్టర్‌కి అభినందనలు: యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజుప్రజాశక్తి- కుప్పం కుప్పం ప్రాజెక్టులో నాలుగు నెలలకు ముందు ఆక్రమంగా తొలగించిన అంగన్వాడీలను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆర్డర్‌ ప్రకారం కలెక్టర్‌ చొరవ తీసుకోవడంతో బుధవారం ప్రమీల, కవితలు సిఐటియు నాయకులు సమక్షంలో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు, యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు లలిత ఆధ్వర్యంలో ఐసిడిఎస్‌ ఆఫీసులో జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చి విధుల్లో చేరడం జరిగిందని తెలిపారు. న్యాయం ఎప్పుడైనా గెలుస్తుందని, అధికారులు కూడా అర్థం చేసుకొవాలన్నారు. ఇప్పటికైనా అధికార రాజకీయ పార్టీకి అండగా ఉంటూ వర్కర్లపై కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని వారు కోరారు. అధికారులు ఇచ్చిన టెర్మినేషన్‌ కోర్టు సస్పెండ్‌ చేసి విధుల్లోకి తీసుకోవాలని ఆర్డర్స్‌ ఇచ్చినా ఐసిడిసి అధికారులు మాత్రం స్పందించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, అంతేకాకుండా మిగతా వాళ్ళందర్నీ మీకందరికీ అదే గతి పడుతుందని హెచ్చరించే ప్రయత్నాలు జిల్లాలో అన్ని ప్రాజెక్టులు అధికారులు చేశారని అన్నారు. అయితే జిల్లా కలెక్టర్‌ చొరవ తీసుకొని తొలగించిన అంగన్వాడీ వర్కర్లు ప్రమీల, కవితలను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ బుధవారం కుప్పం ఐసిడిఎస్‌ కార్యాలయానికి సిడిపిఓ రాకుండా సీనియర్‌ అసిస్టెంట్‌ దగ్గర జాయినింగ్‌ లెటర్లు తీసుకున్నారని, దీన్నిబట్టి ఇప్పటికీ కుప్పం ఐసిడిఎస్‌ కార్యాలయంలో అధికారులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు. ఇలాంటి అధికారులపపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. యూనియన్‌ నాయకులు సరళ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️