ఆ పార్టీలో బలిజలకు ప్రాధాన్యత లేదుఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

ఆ పార్టీలో బలిజలకు ప్రాధాన్యత లేదుఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

ఆ పార్టీలో బలిజలకు ప్రాధాన్యత లేదుఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులువిలేకరుల సమావేశంలో రాజీనామాపత్రాన్ని చూపుతున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వైసిపి ప్రభుత్వంలో బలిజలకు ప్రాధాన్యత లేదని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అసహనాన్ని వ్యక్తం చేశారు. దాదాపు 5 సంవత్సరాలపాటు కష్టపడి పనిచేసిన తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. బుధవారం స్థానిక లక్ష్మీనగర్‌ కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు పాటు ఒక్క పనిని కూడా చేసుకోలేకపోయినట్లు తెలిపారు. నియోజకవర్గంలో అభివద్ధి పనుల కోసం రూపాయి కూడా కేటాయించలేదన్నారు. చిత్తూరు అభివద్ధి కోసం జగన్‌ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తెలిపారు. కాంట్రాక్టర్‌గా ఉన్న తన బిల్లులు కూడా రూ.77 కోట్ల రూపాయలు పెండింగ్‌ పెట్టారన్నారు. రాజ్యసభ ఇస్తామని మాట తప్పడం బలిజలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే పార్టీని వీడాల్సి వస్తోందని చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి గురువారం జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.

➡️