గల్లంతైన విద్యార్థులు మృతి ప్రజాశక్తి -బంగారుపాళ్యం: గల్లంతైన విద్యార్థులు విగత జీవులుగా ఒడ్డున చేరారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తమిళనాడు మహాబలిపురం వద్ద సముద్రంలో ఈత సరదాకు వెళ్లిన విజరు, మోనిష్ లు మతి దేహాలు వెలికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజరు మత దేహానికి బంగారుపాళెం మండలం నలగాంపల్లి పంచాయతీ కెసికటి గ్రామంలో ఆదివారం దహన సంస్కారాలు చేశారు. మోనిష్ మతదేహానికి సోమవారం పోస్టుమార్టం అనంతరం గ్రామానికి తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
