ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలిప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సగిలి షన్మోహన్‌

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలిప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సగిలి షన్మోహన్‌

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలిప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సగిలి షన్మోహన్‌ప్రజాశక్తి-నగరి: ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, నగరినియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సగిలి షన్మోహన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం నగరి ఆర్డీఓ కార్యాలయం సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, నగరి ఆర్డీఓ వెంకట్రామిరెడ్డిలతో కలసి నగరి నియోజకవర్గంలో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలు – 2024లో భాగంగా నామినేషన్లు ప్రక్రియ, పోస్టల్‌బ్యాలెట్‌, లా అండ్‌ ఆర్డర్స్‌, యం.సి.సి, ఎలక్షన్స్‌ వ్యయం, ఎస్‌ఎస్‌టి, ఎఫ్‌ఎస్‌టి, విఎస్‌టి, వివిటి, అకౌంట్స్‌, ఫిర్యాదులు, రిపోర్ట్స్‌, రవాణా, పోలింగ్‌, వివిధ రకాల మేనేజ్మెంట్‌ టీమ్స్‌ లోని అధికారులు ఎలక్షన్స్‌లో నిర్వహించవలసిన బాధ్యతలపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నగరి నియోజకవర్గంలో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి నియోజకవర్గం పరిధిలోని వివిధ రకాల మేనేజ్మెంట్‌ టిమ్స్‌ అధికారులు సమన్వయం చేసుకొని ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్నదా లేదాని ఏఈఆర్‌ఓలు నివేదికను జిల్లా ఎన్నికలు ఎన్నికల అధికారికి పంపించాలన్నారు. ఇంకా ఏమైనా పోలింగ్‌ కేంద్రాలలో మరమ్మతులు చేయవలసి ఉంటే సర్వశిక్ష అభియాన్‌ నుండి నిధులతో పంచాయతీ రాజ్‌ ద్వారా పనులను చేయించాలని ఎంఈఓలను ఆదేశించారు. ఎలక్షన్‌ కోడ్‌ వచ్చినప్పటి నుంచి మోడల్‌కోడ్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌ అమలులోకి వస్తుందన్నారు. ఎన్నికలు పూర్తి అయినంతవరకు యంసిసి ఆములులో ఉంటుందన్నారు. ఎలక్షన్స్‌కు సంబంధించి హ్యాండ్‌బుక్స్‌ పూర్తిగా చదవడం వల్ల సులువుగా ఎలక్షన్స్‌ విధులను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎలక్షన్స్‌ కోడ్‌ వచ్చినప్పటి నుండి ప్రభుత్వ మరియ ప్రవేటు స్థలలలో రాజకీయ పార్టీలు నిర్వహించే సమావేశాలకు సంబంధించి ముందుగా డిఎస్పీ నుండి పర్మిషన్‌ తీసుకోవాల్సి ఉంటుందన్న సమాచారాన్ని రాజకీయపార్టీల నాయకులకు తెలియజేయాలని అన్నారు. అనంతరం నగరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చిన ఈవియంలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్స్‌, రిసెప్షన్‌ సెంటర్‌ జెసి ఆర్‌డివోలతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. గంగాధరనెల్లూరు: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్‌ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నిహాజకవర్గంలో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి నియోజకవర్గం పరిధిలోని వివిధ రకాల మేనేజ్మెంట్‌ టిమ్స్‌ అధికారులు సమన్వయం చేసుకొని ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న జడ్పీ హైస్కూలులో నియోజకవర్గానికి సంబంధించి ఈవిఎంలు రిసెప్షన్‌ సెంటర్‌ను జెసి పి.శ్రీనివాసులు,స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌తో కలసి పరిశీలించారు.

➡️